సహాయక చర్యల కోసం, ఏజెన్సీ అంతర్-ఏజెన్సీ సమన్వయానికి కూడా బాధ్యత వహిస్తుంది. వర్షాకాల అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి , హైదరాబాద్‌ను ఆక్రమణల నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా HYDRAA సిద్ధమవుతున్నందున, నగరంలో అపార్ట్‌మెంట్ , ఇళ్ళు కొనుగోలు చేసే ముందు వివరాలను ధృవీకరించాలని ప్రజలను కోరింది. అందువల్ల ప్రజలు ఎవరైతే హైదరాబాద్‌లో కొత్తగా ఇల్లు ,లేదా ఫ్లాట్ కొనాలని చూస్తున్నారో.. ఈ విషయాలు గమనించాలి. ఏమీ తెలుసుకోకుండా కొంటే మాత్రం తర్వాత బాధ పడాల్సి వస్తుంది. ఎందుకంటే నేలమట్టం అవుతుంది. అందుకే కొనుగోలు చేసే వారు ఒకటికి రెండు సార్లు అన్నింటినీ చెక్ చేసుకోండి. లేదంటే ఇబ్బంది తప్పదు.

























