చివరిగా నవీకరించబడింది:
విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 22న ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 12 బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయి. 18-35 ఏళ్ల నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకోవాలి.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 12 రకాల బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు.
పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ లాంటి విద్యార్హతలు ఉన్న 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీయువకులు ఈ ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని, అడ్మిట్ కార్డు, రెజ్యూమె, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జిరాక్స్ ప్రతులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి. ఫార్మల్ డ్రెస్‌లో ఉదయం 9 గంటలకు కళాశాలలో హాజరు కావాలని సూచించారు.
ఇంటర్వ్యూ సమయంలో ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత కంపెనీలలో ఉద్యోగాలు కల్పించబడతాయని, ఆఫర్ లెటర్ మెయిల్ ద్వారా వారం రోజుల్లో జారీ చేస్తారని తెలిపారు. ఇంటర్వ్యూలో ఎటువంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. అభ్యర్థులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళా నిరుద్యోగులకు కెరీర్‌లో మంచి అవకాశాలను తెచ్చిపెట్టే ఒక గొప్ప వేదికగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh
జూన్ 21, 2025 11:49 AM

























