చివరిగా నవీకరించబడింది:
యాంత్రిక జీవనంలో ఆరోగ్యంపై దృష్టి అవసరం. యోగా, మెడిటేషన్ వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని డైటీషియన్ దీప్తి తెలిపారు. గర్భిణీ స్త్రీలకు గర్భ సంస్కార్ యోగా శిక్షణతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వివరించారు.
ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తేనే ఎంతో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు ప్రముఖ డైటీషియన్ దీప్తి. ఉరుకుల పరుగుల జీవన విధానంలో తప్పనిసరిగా యోగా చేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని అన్నారు.. దీనిని వేళ ఏళ్ల క్రితమే.. యోగులు, బుుషులు కనుగొన్నారని.. ఇది చేయడం వలన శరీరంలో కండరాల కదలికలు మెరుగవుతాయని పేర్కొన్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి నియంత్రణలో ఉంచడానికి యోగా చాలా అద్భుతంగా పని చేస్తుందని శిక్షకురాలు దీప్తి లోకల్ 18కి వివరించారు.
యోగాతో ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిరోజు గంట యోగా చేస్తే శరీరంలో ఉండే చిన్న చిన్న రుగ్మతలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా యోగా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత కూడా వస్తుందని అంటున్నారు. యోగా గురువులు జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా డేగా ప్రకటించారు. అప్పటి నుండి చాలా మంది యోగా మెడిటేషన్ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని యోగా ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకురాలు దీప్తి చెబుతున్నారు. అందరిలా కాకుండా ఇక్కడ చాలా మంది గర్భిణీ స్త్రీలకు గర్భ సంస్కార్ అనే యోగా నేర్పిస్తున్నారు.
ఈ గర్భ సంస్కార్ అనే యోగా చేయడం వలన పుట్టబోయే పిల్లలకు కడుపులోనే ఉన్నప్పుడు వారి కదలికలతో పాటు, ఆరోగ్యం, ఆధ్యాత్మికతను అలవర్చుకుంటారు. బేబీ మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు మనం తల్లి గర్భం ద్వారా తెలుసుకోవచ్చును. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నేర్చుకోవాలంటే కచ్చితంగా శిక్షకురాలు ఉండాలి. శిక్షణ లేకుండా ఎలాంటి యోగా చేయరాదని డైటీషియన్ దీప్తి తెలిపారు.
అయితే డాక్టర్ సూచనలు మేరకు గర్భ సంస్కార్ యోగా చేయాలని.. లేకుంటే చేయకూడదని తెలిపారు. నార్మల్ వారికి ఈ యోగా చేసిన వారికి మధ్య తేడా ఏంటంటే నార్మల్ డెలివరీ.. అలాగే పుట్టబోయే పిల్లలు కొంచెం యాక్టివ్‌గా ఆరోగ్యంగా ఉంటారు. యోగాతోపాటు మంచి ఆకుకూరలు, విటమిన్ ప్రోటీన్స్ కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటే రెండో డెలివరీ కూడా ఇలాంటి ఇబ్బందులు దరిచేరవని వెల్లడించారు. అలాగే భక్త ప్రహ్లాదుడు చరిత్రలో కూడా ఈ గర్భ సంస్కార్ యోగా అనేది ఉందన్నారు.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
కరీంనగర్, తెలంగాణ
జూన్ 20, 2025 10:04 PM





















