HomeసినిమాKuberaa Movie Review: కుబేరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Kuberaa Review and...

Kuberaa Movie Review: కుబేరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Kuberaa Review and Rating in Telugu: Dhanush’s One Man Show in Social Drama

నటీనటులు: నాగార్జున అక్కినేని, ధనుష్, రష్మిక మందన్న, జిమ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, సునైనా, హరీష్ పెరడీ తదితరుల
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
రచన: శేఖర్ కమ్ముల, చైతన్య పింగిలి
నిర్మాత: సునీల్ నారంగ్, పుస్కర్ రాంమోహన్ రావు
సినిమాటోగ్రఫి: నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్
రిలీజ్ డేట్: 2025-06-20

దేశంలోని బిజినెస్ రంగాన్ని శాసించే పారిశ్రామిక వేత్త, బిలియనీర్ నీరజ్ (జిమ్ సరబ్) తాను అక్రమంగా సంపాదించిన డబ్బును చట్ట వ్యతిరేకంగా తన ఖాతాలోకి మళ్లించాలని అనుకొంటాడు. అందుకు జైలులో ఉన్న దీపక్ ( నాగార్జున అక్కినేని) సహాయం కోరుతాడు. జైలు నుంచి విడిపించిన నల్ల ధనాన్ని తన ఖాతాలోకి మళ్లించే ప్లాన్ వేస్తారు. అందుకు బిచ్చగాళ్లైన దేవా (ధనుష్), ఖేలూ,దివ్య, కుష్బూను ఉపయోగించుకొంటారు. బిచ్చగాళ్లను బిజినెస్ మ్యాన్స్‌గా మార్చి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారు. ఈ క్రమంలో నీరజ్, దీపక్ గ్రూప్ నుంచి దేవా తప్పించుకొంటాడు. ఆ క్రమంలో సమీరా ( రష్మిక మందన్న) కలుస్తాడు. అయితే నీరజ్ మనషులు వెంటాతుండటంతో వారికి దేవా ఎదురు తిరుగుతాడు.

కుబెరా సమీక్ష

నీరజ్ చేసే దందాలు ఎలాంటివి? వ్యాపార రంగంలో దేశాన్ని ఎలా శాసించాలని ప్లాన్ వేస్తాడు? దీపక్ ఎవరు? ఎందుకు జైలులో ఉన్నాడు? ఏ కండిషన్స్ మీద దీపక్‌ను జైలు నుంచి నీరజ్ విడిపిస్తాడు? ఏ రకంగా డబ్బును హవాలా మార్గంలో మళ్లిస్తారు? నీరజ్ ముఠాను దేవా ఎందుకు ఎదురిస్తాడు? ఏ పరిస్థితుల్లో సమీరాను దేవా కలుస్తాడు? దేవా, సమీరా ప్రయాణం ఎలా సాగింది? చివరకు దేవా, నీరజ్ మధ్య వైరానికి ఎలాంటి ముగింపు లభించింది? ఈ వ్యవహారంలో దీపక్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానమే కుబేరా సినిమా కథ.

నీరజ్ అనే పారిశ్రామికవేత్త మాఫియా వ్యవహారాలు, కుట్రలు, కుతంత్రాలతో సినిమాను గుడ్ నోట్‌‌లోనే మొదలవుతుంది. ధనుష్ ఎంట్రీ వరకు సినిమా కథను సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్లడానికి శేఖర్ కమ్ముల టైమ్ ఎక్కువగానే తీసుకొన్నాడు. ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటే సినిమాకు ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. నాగార్జున క్లాస్‌గా, ధనుష్ మాస్ అప్పీల్‌తో సినిమాను తమ పెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టే ప్రయత్నం చేశారనిపిస్తుంది. జిమ్ సరబ్ క్యారెక్టర్‌ను మలిచిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో రష్మిక ఎంట్రీ సీన్ కూడా బాగుందనిపిస్తుంది. ఇలాంటి అంశాలతో ఓ మంచి ట్విస్టుతో ప్రథమార్థాని ముగించి సెకండాఫ్‌పై ఆసక్తిని దర్శకుడు కలిగించాడు.

ఇక సెకండాఫ్‌లో రొటీన్‌గా దేవా ఛేజింగ్ సీన్లు కొనసాగుతాయి. సినిమా మూమెంట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఊగిసలాటకు గురి అవ్వడం సినిమాకు మైనస్. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు దర్శకుడు అనుసరించిన పంథా బాగుంది. ఎమోషనల్ క్లైమాక్స్, హృదయాన్ని తట్టి లేపే డైలాగ్స్‌తో ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేయడంలో శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ధనుష్ వన్ మ్యాన్ షోగా మార్చాడు. ఎప్పటిలానే ధనుష్ కాకుండా పాత్ర మాత్రమే కనిపించే లెవెల్‌లో ఫెర్ఫార్మెన్స్ చేశారు. బిచ్చగాడిగా ధనుష్ లుక్, హావభావాలు, క్యారెక్టర్ యాటిట్యూడ్ చక్కగా కుదిరాయి. ఇక నాగార్జున విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఒక ఇమేజ్ ఉన్న హీరోగా చూశాం. కానీ ఈ సినిమాలో డిఫరెంట్ నాగ్‌ను చూస్తాం. దీపక్ అనే అధికారి పాత్రలో చాలా డిగ్నిఫైడ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ఇక రష్మిక మరోసారి ఇరగదీసింది. సింపతీ కనిపించే పాత్ర ద్వారా మంచి ఫన్ జనరేట్ చేసింది. కొన్ని సమస్యలు, బాధలో ఉన్న సమీరా పాత్ర ద్వారా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించింది. తెలుగు తెర మీద జిమ్ సరబ్ కొత్త విలనిజాన్ని చూపించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అంశాలు ప్లస్ పాయింట్. నికేత్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం.. ఆర్ట్ విభాగం పనితీరును చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. కలర్ ప్యాటర్న్ డిఫరెంట్ ఫీల్‌ను కలిగించింది. ఇక ఈ సినిమాను నిడివి కొంత మేరకు దెబ్బ తీసింది. ఫస్టాఫ్‌లో కనీసం 10 నిమిషాలు నిడివిని ట్రిమ్ చేయొచ్చు. ఇక సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో చాలా ల్యాగ్ ఉంది. సునీల్ నారంగ్, రాంమోహన్ రావు అనుసరించిన నిర్మాణ విలువలు హై క్లాస్ ఉన్నాయి.

ఓవరాల్‌గా సినిమా విషయానికి వస్తే.. సంపన్న వర్గాలకు, అణగారిన వర్గానికి మధ్య జరిగే రివేంజ్ డ్రామా కుబేర. సింపుల్ పాయింట్ చుట్టూ రకరకాల పాత్రలను అల్లిన తీరు బాగుంది. కానీ సన్నివేశాల్లో బలం లేకపోవడం, ఎమోషన్స్ భారీగా పండకపోవడంతో మూవీ సాదా సీదాగా సాగుతుంది. ఫస్టాఫ్‌లోనే కథకు ముగింపు ఏమిటో అర్ధమవ్వడంతో.. చివరి వరకు ఎలాంటి ఎలా తీసుకెళ్తాడనే ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌ కూడా ఆసక్తికరంగా సాగపోవడం మైనస్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో పోరా పోరా పాట లేకపొతే సినిమా మరింత నీరసంగా ఉండేదనిపిస్తుంది. కేవలం నటీనటుల పెర్ఫార్మెన్స్ ముఖ్యంగా ధనుష్, రష్మిక యాక్టింగ్ సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు. మంచి స్టార్ వాల్యూ, యాక్టర్ల పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమాను ఈ వారాంతంలో చూసే సినిమాల్లో ఒకటిగా నిస్సందేహంగా చేర్చుకోవచ్చు. గొప్పగా ఊహించుకోకుండా వెళ్తే ఓ రకమైన సంతృప్తిని పొందడం గ్యారెంటీ. మల్టిప్లెక్స్ ఫ్లేవర్ ఉన్న ఈ చిత్రానికి బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు ఆదరణ దక్కితే భారీ విజయం సాధించే అవకాశం ఉంది.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Extramarital Affair: భర్తకు బిర్యానీ పెట్టి.. బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో అరాచకం.. నైట్ అంతా అదే పని | ట్రెండింగ్

0
చివరిగా నవీకరించబడింది:జనవరి 22, 2026 3:16 PM ISTExtramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను...

CMAT అడ్మిట్ కార్డ్ 2026 cmat.nta.nic.inలో విడుదల చేయబడింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 22, 2026 9:46:33 AM ISTCTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో విడుదల కానుందిCTET పరీక్ష సిటీ...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

error: Content is protected !!