Homeతెలంగాణఅమీన్‌పూర్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం.. ఆధ్యాత్మిక కేంద్రం. Bhramaramba Mallikarjuna Temple Center of...

అమీన్‌పూర్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం.. ఆధ్యాత్మిక కేంద్రం. Bhramaramba Mallikarjuna Temple Center of Devotees Faith for Six Centuries

చివరిగా నవీకరించబడింది:

అమీన్‌పూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆరో శతాబ్దానికి చెందిన ప్రాచీన దేవాలయం. భక్తులు సోమవారం పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు.

X

స్వయంభుగా వెలస భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం అమీన్పూర్ గ్రామ శివారులో గుట్టపై వెలసిన.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆరో శతాబ్దానికి చెందిన ప్రాచీన దేవస్థానంగా భక్తుల నమ్మకానికి కేంద్రబిందువుగా నిలిచింది. స్వయంభువుగా గుట్టలో వెలిసిన ఈ దేవతలు, తొలినాళ్లలో దర్శించేందుకు భక్తులు రాళ్లు, చెట్లు దాటుకుంటూ.. కష్టపడి గుట్టెక్కేవారు. అప్పట్లో మార్గం లేకపోయినా భక్తుల తాకిడి కూడా చాలా ఉండేదని పూజారి లోకల్ 18కు తెలిపారు.

కాలక్రమంలో ఈ ఆలయం దినదినం అభివృద్ధి చెందుతూ.. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలో నడుస్తోంది. ఈ పవిత్ర దేవస్థానం నుండి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయని పూజారి తెలిపారు. ప్రతి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని కోరికలు తీరతాయని నమ్ముతారు. హైదరాబాద్, పటాన్‌చెరు, లింగంపల్లి, అమీన్పూర్ వంటి పరిసర ప్రాంతాల నుండి భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామిని దర్శించుకుంటారని తెలిపారు.

భ్రమరాంబ మల్లికార్జునుని దర్శించడం అంటే శివుని దర్శించినట్లే అన్నది భక్తుల నమ్మకం. శివుడే కర్త, కర్మ, క్రియ అన్న తత్వాన్ని ఈ ఆలయం ప్రతిబింబిస్తోందని వారు భావిస్తారు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి పర్వదినాన్ని మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా, శ్రావణ మాసంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని పూజారి తెలిపారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన గోశాలలో గోమాతను దర్శించే అవకాశాన్ని ఉందన్నారు. ఈ ఆలయం ఇప్పుడు భక్తి, శ్రద్ధ, నమ్మకానికి ప్రతీకగా మారింది.

స్వయంభువుగా వెలసిన భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ప్రతిరోజూ పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో నిత్య సేవలు, ప్రత్యేక పూజలు, భక్తుల కోరికల మేరకు అభిషేకాలు చేస్తునట్లు తెలిపారు.

ఉదయం స్వామివారిని మేల్కొలిపే సుప్రభాత గానం ఉంటుంది. అనంతరం మల్లికార్జున స్వామికి గంగజలం, పాలు, పెరుగు, తేనె, చందనం, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. విగ్రహాలకు పుష్పాలంకరణ, వస్త్రధారణనైవేద్యం, హారతి సమర్పిస్తారు. స్వామికి నైవేద్యంగా పండ్లు, ప్రసాదం సమర్పిస్తారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిని ఇస్తారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!