చివరిగా నవీకరించబడింది:
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో బెట్టారని కన్నీరు పెట్టుకున్నారు లోకేష్.అంతే కాదు ఎప్పుడూ బయటకురాని తన తల్లి భువనేశ్వరిని మానసికక్షోభకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై నారా లోకేష్(Lokesh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్ జగన్(YS Jagan) సర్వనాశనం చేశారంటూ సీఎంపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో బెట్టారని కన్నీరు పెట్టుకున్నారు లోకేష్.అంతే కాదు ఎప్పుడూ బయటకురాని తన తల్లి భువనేశ్వరిని మానసికక్షోభకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ విస్తృత స్తాయి సమావేశంలో నారా లోకేష్ తన కుటుంబం, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి జరుగుతున్న పరాభవంపై బాధను వెలిబుచ్చారు.
కంటతడి పెట్టుకున్న నారా లోకేష్..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బావోధ్వేగానికి లోనయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడ్ని స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో పెట్టి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వైసీపీ పాలకులపై మండిపడ్డారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశం వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు నారా లోకేష్. ఏపీ కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడ్డారని ..అలాంటి రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.
45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేసిన చంద్రబాబు గారిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి మరీ 43 రోజులుగా నిర్బంధించారు. ఇది కలలో కూడా ఊహించనిది. తలచుకుంటేనే దుఃఖం తన్నుకొస్తోంది. #Falsecasesa pic.twitter.com/ibtbg39hh4
– లోకేష్ నారా (@naralokesh) అక్టోబర్ 21, 2023
కక్ష సాధింపు ఇంత నీచమా..
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులు పెట్టడం,చంద్రబాబును జైల్లో పెట్టించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ప్రజల కోసం ఎలాంటి సమస్యల్ని లెక్కచేయని చంద్రబాబుకు ఇందిరా గాంధీనే లెక్కచేయలేదు..మరుగుజ్జు జగన్ మనకో లెక్కా? అంటూ సీఎంపై విమర్శలు గుప్పించారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే 160 సీట్లు ఖాయమని తెలిసే చంద్రబాబును జైల్లో పెట్టించారని ఆరోపించారు నారా లోకేష్. జనసేన, టీడీపీ కలిసి పోరాటం చేయకపోతే జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కులు చేసి ఏ నాడో అమ్మేసేవారని ఘాటు విమర్శలు చేశారు.
చంద్రబాబు మండేలాతో సమానం..
నా తల్లి ఏనాడు బయటకు రాలేదని..అలాంటి నారా భువనేశ్వరిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వైసీపీ పాలకును తప్పుపడుతూ భావోద్వేగానికి లోనయ్యారు లోకేష్. అదే విధంగా జగన్.. మీ కుటుంబ విషయాలను బయటపెడితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్ అంటూ ప్రశ్నించారు లోకేష్ చంద్రబాబును నెల్సన్ మండేలాతో పోల్చితే నారా లోకేష్..చంద్రబాబు డబ్బే సంపాదించాలనుకుంటే రాజకీయాలు అవసరం లేదని ..చంద్రబాబు బిజినెస్ చేస్తే వ్యాపారవేత్తలు ఎవరూ తట్టుకోలేకపోయేవారని ధీమాగా చెప్పారు.
మాకలాంటి అలవాటు లేదు..
చంద్రబాబుకు పంపే భోజనంలో విషం పెడతామని తమపై ఆరోపణలు చేస్తున్నారని..గవర్నర్‌ని కలవకుండా అడ్డుకుంటున్నారని లోకేష్ చెప్పారు. భోజనంలో విషం కలపడాలు, కోడి కత్తి డ్రామాలు మా డీఎన్‌లో లేవన్నారు లోకేష్. చంద్రబాబు ఇచ్చిన స్పూర్తితోనే శాంతియుతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 21, 2023 3:38 PM

























