జిల్లాలో మే 20వ తేదీ వరకు చూస్తే నల్గొండ జిల్లాలో కొత్తవాటితో పాటు పాత కార్డుల కలిపి మొత్తం 4,84,216 రేషన్ కార్డులు ఉన్నాయి. నూతనంగా మంజూరైన ఈ కార్డులకు అనుగుణంగా, ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యాన్ని ముందుగానే కేటాయించింది. మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల బియ్యం మూడు నెలల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ప్రస్తుతం ఆ కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.






















