చివరిగా నవీకరించబడింది:
కరీంనగర్ మాత శిశు ఆసుపత్రిలో పిల్లల సంరక్షణ (ఊయల) కార్యక్రమం ప్రారంభించారు. పిల్లల్ని పోషించలేనివారు ఇక్కడ వదిలి వెళ్లడానికి ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. పిల్లలను వదిలి వెళ్ళే వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు.
వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందే గర్భవతి కావడం వల్ల పుట్టిన పిల్లల్ని వదిలించుకోవడానికి చంపడానికి కూడా వెనకాడని ఘటనల్ని చాలానే చూస్తున్నాం. అలాగే పిల్లలను పోషించలేక, వదిలి వెళుతున్న సంఘటనలు ప్రతిరోజు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాము. అలాంటి వారి కోసం అప్పుడే పుట్టిన శిశువును వద్దనుకునే వారికి కరీంనగర్ మాత శిశు ఆసుపత్రిలో పిల్లల సంరక్షణ (ఊయల) అనే కొత్త కార్యక్రమానికి స్వీకారం చుట్టారు అధికారులు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మహిళా, శిశు, సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిశువుల స్వీకరణ కేంద్రాన్ని గత నెల మే 14న జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అప్పుడే పుట్టిన శిశువులను వద్దనుకునేవారు ఊయలను సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు. శిశువులకు అనారోగ్య సమస్యలు ఉన్నా వైద్యం అందించి శిశు గృహానికి తరలించి పెంచి పెద్ద చేస్తారని అన్నారు.
ఇది ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒక ఆడ శిశువును ఇక్కడ వదిలి వెళ్లారు. ఆ పాప వయస్సు 4 సంవత్సరాలు అని డాక్టర్స్ నవీన ఇంచార్జ్ ఆర్ఎంఓ వెల్లడించారు. ఆ పాప ప్రస్తుతం ఐసీయూలో ఉంది. హెల్త్ బాగా లేకపోవడంతో చికిత్స అందిస్తున్నామన్నారు. తరువాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు. ఈ ఊయల వద్ద ఎలాంటి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండదని, ఊయలలో వేసిన వారిపై నిఘా, విచారణ వంటివి ఉండవని తెలిపారు.
పిల్లలను వదిలి వెళ్ళే వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. ఒక వేళ నేరుగా శిశువును అప్పగించాలనుకునేవారు 94908 81098 నెంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. శిశువులను రోడ్లపైన, చెత్తకుప్పలపైన వదిలేయడం వల్ల మరణించే అవకాశం ఉందని, ఎంతోమంది పిల్లలు లేని దంపతులు దత్తత కోసం ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వదిలి వేసిన శిశువులను చట్టప్రకారం దత్తత ఇస్తారని వివరించారు. ఆపదలో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098ను సంప్రదించాలని సూచించారు.
పిల్లలు లేని తల్లిదండ్రులు పిల్లలు కావాలనుకునేవారు శిశు సంరక్షణ శాఖ జిల్లా పరిషత్ కార్యాలయమునందు సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియపరుస్తారన్నారు. త్వరలో జిల్లాలోని జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఊయలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలోనూ ఊయల ప్రారంభిస్తామని వివరించారు. ఇప్పుడు ఈ ఊయల కాన్సెప్ట్ మంచి ఫలితాలను కూడా ఇస్తుందన్నారు అధికారులు.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
కరీంనగర్, తెలంగాణ
జూన్ 20, 2025 10:12 ఆన్
























