చివరిగా నవీకరించబడింది:
Skilled Handicap: దుర్గిలోని నాగార్జున శిల్పకళా కేంద్రంలో తయారైన విగ్రహాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ కేంద్రంలోని దివ్యాంగుడైన ఓ కళాకారుడు రెండు కాళ్లూ లేకపోయినా శిల్పాలు చెక్కటంలో మంచి ప్రావీణ్యం ఉంది. అతని చేయి పడితే చాలు శిల కూడా శిల్పంగా మారాల్సిందే.
(అన్నా రాఘు, కరస్పాండెంట్, న్యూస్ 18, అమరావతి)
పల్నాడు (Palnadu)జిల్లా దుర్గి(Durgi). ఈ ప్రాంతం శిల్ప కళాకారులకు చాలా ఫేమస్. ప్రపంచ ప్రఖ్యాత శిల్ప కళాకారులు దుర్గిలో 8 శతాబ్దాలుగా వారి సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలకు కూడా దుర్గి శిల్ప కళాకారులు, వారు తయారు చేసిన శిల్పాలను ఎగుమతి చేస్తూ వస్తున్నారు. ఇక్కడి కళాకారులు రూపొందిస్తున్న శిల్పాలకు జియోగ్రాఫికల్(Geographical)గుర్తింపు కూడా లభించింది. ఎందరో ముఖ్యమంత్రులు ఇక్కడి శిల్ప కళాకారులను సత్కరించారు. మరెన్నో విశేషాలున్న దుర్గి శిల్ప కళ రాను రాను కళావిహీనంగా తయారవుతోంది. ఒకప్పుడు 400 మంది శిల్ప కళాకారులు ఉండగా నేడు 30 మంది మాత్రమే మిగిలారు. శిల్ప కళకు ఆదరణ తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
బండరాళ్లను విగ్రహాలుగా మలిచే కళ..
దుర్గి ప్రాంతం శిల్పాలకు ఫేమస్..
ఆచార్య నాగార్జునుడు ఈప్రాంతం వాసే. ఆచార్య నాగార్జునుడు దుర్గి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చరిత్ర తిరగేస్తే తెలుస్తోంది. 12వ శతాబ్దం ఆరంభం నుంచి ఇక్కడ శిల్ప కళాకారులు వారి పనితనం ప్రపంచానికి పరిచయం చేశారు. దాదాపు 8 దశాబ్దాల పాటు ఎదురే లేకుండా వారి ప్రయాణం సాగిపోయింది. 2020 వరకు దుర్గిలో 300 మంది శిల్పలు నిరంతరం శిల్పాలకు ప్రాణం పోస్తూ ఉండేవారు. ఆ తరవాత క్రమంగా శిల్పాలకు గిరాకీ తగ్గిపోయింది. దీంతో చాలా మందికి ఉపాది లేక వలస పోయారు. ప్రస్తుతం కేవలం 30 కుటుంబాలకు చెందిన కొద్ది మంది మాత్రమే శిల్ప కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.
దివ్యాంగుడిలో అద్భుత నైపుణ్యం..
దుర్గిలోని నాగార్జున శిల్పకళా కేంద్రంలో తయారైన విగ్రహాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ కేంద్రంలోని దివ్యాంగుడు మల్లిఖార్జునరావు తన శిల్పకళా చాతుర్యం తో ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు కాళ్లూ లేకపోయినా ఆయన కు శిల్పాలు చెక్కటం లో మంచి ప్రావీణ్యం ఉంది. రెండు కాళ్లు లేకున్నా ఖాళీగా ఉండక తనకు వచ్చిన విద్యతో నాగార్జున శిల్పకళా కేంద్రం లో శిల్పాలు చెక్కుతూ ఉపాధి పొందుతున్నాడు. ఈ కేంద్రం యజమాని చెన్నుపాటి శ్రీను అందిస్తున్న సహకారంతోనే తాను విగ్రహాలు మలచగలుగుతున్నానని మల్లిఖార్జునరావు చెబుతున్నారు. శిల్పాలు చెక్కడంలో పల్నాడుకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడంలో దివ్యాంగుడు మల్లిఖార్జునరావు సేవలు మరవలేనివి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
మార్చి 08, 2023 4:37 PM

























