చివరిగా నవీకరించబడింది:
AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటూ విపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన ఈసారి అధికార వైసీపీని ఓడించడానికి ఏకమయ్యాయి. అంతే కాదు ఉమ్మడి కార్యాచరణతో పాటు ఉమ్మడి యుద్ధానికి కూడా సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే ఆదివారం జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో సుధీర్ఘ సమయం పాటు మంతనాలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటూ విపక్షాలుగా ఉన్న టీడీపీ(TDP), జనసేన(Janasena) ఈసారి అధికార వైసీపీని ఓడించడానికి ఏకమయ్యాయి. అంతే కాదు ఉమ్మడి కార్యాచరణతో పాటు ఉమ్మడి యుద్ధానికి కూడా సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే ఆదివారం జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో సుధీర్ఘ సమయం పాటు మంతనాలు జరిపారు.పొత్తు పొడిచేనా..ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటూ విపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన ఈసారి అధికార వైసీపీని ఓడించడానికి ఏకమయ్యాయి. అంతే కాదు ఉమ్మడి కార్యాచరణతో పాటు ఉమ్మడి యుద్ధానికి కూడా సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే ఆదివారం జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో సుధీర్ఘ సమయం పాటు మంతనాలు జరిపారు. ఈభేటీలో సీట్ల సర్దుబాటుతో వైసీపీ పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టం ఎలా అనే అంశాలపై ఒకరికొకరు అభిప్రాయాల్ని పంచుకున్నారు.
పొత్తు పొడిచేనా..
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటూ విపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన ఈసారి అధికార వైసీపీని ఓడించడానికి ఏకమయ్యాయి. అంతే కాదు ఉమ్మడి కార్యాచరణతో పాటు ఉమ్మడి యుద్ధానికి కూడా సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే ఆదివారం జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో సుధీర్ఘ సమయం పాటు మంతనాలు జరిపారు. ఈభేటీలో సీట్ల సర్దుబాటుతో వైసీపీ పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టం ఎలా అనే అంశాలపై ఒకరికొకరు అభిప్రాయాల్ని పంచుకున్నారు.
3గంటల పాటు మంతనాలు..
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు గంటల పాటు సాగిన సమయంలో జనసేన అధ్యక్షుడు 35ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు 28 అసెంబ్లీ సీట్లు, 3ఎంపీలు సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. అయితే పవన్ కల్యాణ్ ఎంపీ సీట్లకు తలొగ్గినప్పటికి 35 సీట్లు ఫైనల్ చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇక సీట్ల పంపకం పక్కన పెడితే ఉమ్మడి మానిఫెస్టో, ఉమ్మడి పర్యటనలతో పాటు బీజేపీతో పొత్తు అంశం కూడా ఢిల్లీ పర్యటన తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆశావాహులకు హామీలు..
టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల అధ్యక్షుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఒకరకంగా ఫలించాయనే తెలుస్తోంది. అయితే రెండు పార్టీలు పోటీ చేసే స్థానాల్లో ఆశలు పెట్టుకున్న జనసేన, టీడీపీ నాయకులకు పార్టీ అధ్యక్షులే స్వయంగా పిలిపించుకొని నచ్చజెప్పనుంది. ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ అధిష్ఠానం స్పష్టమైన హామీ ఇవ్వనుంది. ఇరుపార్టీల్లోని ఆశావహులకు నచ్చజెప్పిన తర్వాతే అభ్యర్థుల జాబితాలు ప్రకటించాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించుకున్నారు.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
ఫిబ్రవరి 04, 2024 7:25 PM IST

























