పిడుగురాళ్ళ విద్యార్థిని ఆత్మహత్య

మీడియా ప్రతినిధి – పిడుగురాళ్ళ: పిడుగురాళ్ళకి చెందిన 19ఏళ్ల యువతి స్వర్ణ కుమారి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు భీమవరం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మెదటి సంవత్సరం చదువుతోంది. ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందని సహచర విద్యార్థినులు తెలిపారు. తన స్నేహితులు పిక్నిక్ వెళ్లే సమయంలో తనకు కాలు బాలేదని ఆగిపోయింది. వారు తిరిగి వచ్చే సమయానికి రూమ్ లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
























