ప్రధాని మోదీ షెడ్యూల్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బీహార్‌లోని సివాన్, ఒడిశాలోని భువనేశ్వర్‌లలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.40కి విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి విమానాశ్రయానికి వస్తారు. తర్వాత ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కి వెళ్తారు. రాత్రి అక్కడే పడుకుంటారు. శనివారం ఉదయం 6.25కి ఆర్కే బీచ్‌కి వెళ్తారు. 6.30 నుంచి 7.50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. స్వయంగా యోగాసనాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. ఇది గతంలో సూరత్‌లో (2023) 1,53,000 మందితో సాధించిన గిన్నీస్ రికార్డును అధిగమించే లక్ష్యంతో ఉంది. ఈ కార్యక్రమం తర్వాత మోదీ ఉదయం 11.25కి తిరిగి విశాఖ ఎయిర్ పోర్టుకి వెళ్లి.. 11.50కి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరతారు.
ఏపీ ప్రభుత్వ ఏర్పాట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ‘యోగాంధ్ర-2025’ అనే థీమ్‌తో నిర్వహిస్తోంది. ఆర్‌కే బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 26 కిలోమీటర్ల పొడవునా 247 యోగా ప్రాక్టీస్ కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు. 5 లక్షల యోగా మ్యాట్‌లు, 5 లక్షల టీ-షర్టులను పంపిణీ చేస్తున్నారు. రవాణా కోసం 1,300 ఆర్టీసీ, 885 ప్రైవేట్ బస్సులు కలిపి మొత్తం 2,085 బస్సులు సిద్ధం చేశారు. ప్రతి 100 మంది పాల్గొనేవారికి ఒక టాయిలెట్, 200 అంబులెన్స్‌లు, 2,000 సీసీటీవీ కెమెరాలు, ఒక్కో కిలోమీటరుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వాతావరణం విషయంలో, వర్షం వస్తే ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో 15,000 మంది కోసం రెయిన్‌ప్రూఫ్ టెంట్ సిద్ధం చేశారు.
🌞 యోగాంధ్రా 2025 కేవలం మూలలో ఉంది! 🌿
ఈ జూన్ 21, మేము యోగా ద్వారా మాత్రమే కాకుండా, శుభ్రమైన మరియు అందమైన విశాఖపట్నం పట్ల మా నిబద్ధత ద్వారా కూడా ప్రపంచానికి చూద్దాం. 🧹✨Open ఓపెన్ లిట్టరింగ్ మానుకోండి
The డస్ట్బిన్లను బాధ్యతాయుతంగా వాడండి
Example ఉదాహరణ ద్వారా నాయకత్వం వహిద్దాం… pic.twitter.com/rsvrvjue3z– గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) (@gvmc_visakha) జూన్ 19, 2025
గిన్నీస్ రికార్డు లక్ష్యాలు:
ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధాన గిన్నీస్ వరల్డ్ రికార్డులను సాధించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిని గమనిస్తే..
1. అతిపెద్ద యోగా సమావేశం: 5 లక్షల మంది ఒకేసారి యోగా చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించడం.
2. సూర్యనమస్కారాల రికార్డు: 25,000 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్యనమస్కారాలు చేస్తారు.
అదనంగా 22 ఇతర ప్రపంచ రికార్డులను (వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా) సాధించేందుకు 22 విభాగాలలో యోగా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ రికార్డుల కోసం గిన్నీస్ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు.
యోగాంధ్ర-2025 కార్యక్రమం:
మే 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర’ పేరుతో నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2.17 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు, 25 లక్షల మందికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ శిక్షణలు, గ్రామ, వార్డ్ సెక్రటేరియట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. ఆంధ్రా యూనివర్సిటీ 1,400 మంది విద్యార్థులను ట్రైనర్లుగా తయారు చేసింది, వీరిలో 200 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు.
ముఖ్యమంత్రి సందేశం:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని “ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం” అని అన్నారు. “యోగా ఒక జీవన విధానం. దీన్ని 9వ తరగతి నుంచి పాఠశాలల్లో పరిచయం చేస్తాం. ఇది ఆరోగ్యంతో పాటు ఉత్పాదకతను పెంచుతుంది” అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ సలహాతో విశాఖను ఎంపిక చేశామని, ఈ వేడుకలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాయని ఆయన చెప్పారు.
విశాఖపట్నం యోగా డిక్లరేషన్:
ఈ కార్యక్రమంలో “విశాఖపట్నం యోగా డిక్లరేషన్” ప్రకటిస్తారు. ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల యోగా ప్రమోషన్ కట్టుబాట్లను హైలైట్ చేస్తుంది. ఈ వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ను ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’గా మార్చే దిశగా ఒక ముందడుగుగా ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
హైదరాబాద్, తెలంగాణ
జూన్ 20, 2025 10:43 ఆన్
























