తనపై 14 కేసులు పెట్టారని, ఇంకా 14,000 కేసులు పెట్టుకున్నా భయపడబోనని కేటీఆర్ అన్నారు. “పిలుచుడు, చాయి తాపిచ్చుడు, తిప్పి తిప్పి ప్రశ్నలు అడుగుడు” అంటూ ఏసీబీ విచారణ తీరుపై వ్యంగ్యంగా స్పందించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను “చిత్తు చిత్తుగా ఓడించాలి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 21న సంబరాలు చేసుకుందామని, కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలని ఆయన సూచించారు. “కేసులు, విచారణ పాత చింతకాయ పచ్చడే. నీలాగా లుచ్చా పనులు చేసి, అడ్డంగా డబ్బు కట్టలతో దొరికిన వాడు లేడు. అడ్డదారిలో పదవులు కొనుక్కొని పీసీసీ ప్రెసిడెంట్ అయిన వాడు లేడు” అంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
























