భారత్ సహా 14 దేశాల వీసాలపై సౌదీ నిషేధం

హజ్ 2025 యాత్రకు ముందు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా 14 దేశాలకు వీసాల జారీని సౌదీ అరేబియా నిలిపి వేసింది. జూన్ వరకు ఉమ్రా, వ్యాపార, కుటుంబ వీసాలపై ఈ నిషేధం అమల్లో ఉండనుంది. హజ్ వీసాలపై మాత్రం ఆంక్షలు లేవు. వీసా వ్యవస్థలో గందరగోళం, అక్రమ హజ్ యాత్రలు, కుటుంబ వీసాలపై సౌదీలోకి ప్రవేశించి రూల్స్ కు విరుద్ధంగా వలస, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ఘటనలతో సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది.
మీడియా ప్రతినిధి





















