చివరిగా నవీకరించబడింది:
ఇక్కడి అణువణువు నాటి చరిత్రకు సాక్ష్యం. ఈ ఆనవాళ్లను చూస్తే ఆశ్చర్య పోవడం మీ వంతు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది ఆచార్య నాగార్జునుడు, నాగార్జున సాగర్ డ్యాం కట్టముందుకు నిర్మించారు. ఆచార్య నాగార్జున బోధించినటువంటి పాఠాలు, వేదాలు, ప్రణాళికలు, సంస్కృతపరంగా ఉన్న ప్రదేశం అనుపు గ్రామం. అదేవిధంగా ఆ కాలంనాటి కట్టడాలు అయినటువంటి స్థాన ఘట్టాలు, మాలికలు, ఆట స్థలాల వంటి ప్రదేశాలు ఉన్నాయని స్థానికులు లోకల్18 ద్వారా తెలియజేశారు.పల్నాడు జిల్లాలో ఉన్న అణుపు గ్రామంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉండేది. నేటికి కూడా పూర్వకాలంలో నాటి స్థాన ఘట్టాలు మాలికలు అప్పటి సంస్కృతం కళ్ళకు కట్టినట్టు ఉంది. దీనిపై స్థానికులైన కురుమేటి దత్త కుమార్ శర్మ తెలియజేసిన వివరాల ప్రకారం.. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఆచార్య నాగార్జునుడు ఇక్కడికి వచ్చి విశ్వవిద్యాలయం కృష్ణ నది ఒడ్డున స్థాపించారు. నాగార్జున సాగర్ జలాశయం ముంపు ప్రాంతం కావడం వలన నీట మునిగిపోవడంతో అప్పుడు అక్కడి అవశేషాలను నాగార్జునకొండపైన మ్యూజియంలో భద్రపరిచారు.ఇప్పటికి దాదాపు బౌద్ధ మత సంబంధించిన ఆనవాళ్లు ఉండడంతో పర్యాటకులు, ఈ ప్రదేశాన్ని చూసేందుకు వస్తుంటారన్నారు. విశ్వవిద్యాలయం శిథిలాలను మాత్రం అక్కడ సంబంధించిన గృహ నిర్మాణాలు, శిలాఫలకాలలో పూర్వంలో ఉండే విధంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల మండలం అనుపు గ్రామంలో భద్రపరచడం చేశారు. ఇక్కడ పూర్వంలో బౌద్ధులు మార్షల్ ఆర్ట్స్ వంటి ప్రాక్టీస్ ఇక్కడే చేసేవారని చెబుతున్నారు.ఇక్కడ గతంలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని ఆనవాళ్లు చూడటానికి పర్యాటకులు, నాగార్జునసాగర్ కు వచ్చిన ప్రతి పర్యాటకుడు దీనికి కొద్ది దూరం ఎత్తిపోతల జలపాతాన్ని అదే విధంగా స్వయంగా వెలిసిన దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. పిక్నిక్ పరంగా గాని, విహారయాత్ర పరంగా గాని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల పాటు ఇతర రాష్ట్రాల నుండి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారని లోకల్ 18 ద్వారా తెలిపారు.
పల్నాడు జిల్లాలో ఉన్న అణుపు గ్రామంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉండేది. నేటికి కూడా పూర్వకాలంలో నాటి స్థాన ఘట్టాలు మాలికలు అప్పటి సంస్కృతం కళ్ళకు కట్టినట్టు ఉంది. దీనిపై స్థానికులైన కురుమేటి దత్త కుమార్ శర్మ తెలియజేసిన వివరాల ప్రకారం.. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఆచార్య నాగార్జునుడు ఇక్కడికి వచ్చి విశ్వవిద్యాలయం కృష్ణ నది ఒడ్డున స్థాపించారు. నాగార్జున సాగర్ జలాశయం ముంపు ప్రాంతం కావడం వలన నీట మునిగిపోవడంతో అప్పుడు అక్కడి అవశేషాలను నాగార్జునకొండపైన మ్యూజియంలో భద్రపరిచారు.
ఇప్పటికి దాదాపు బౌద్ధ మత సంబంధించిన ఆనవాళ్లు ఉండడంతో పర్యాటకులు, ఈ ప్రదేశాన్ని చూసేందుకు వస్తుంటారన్నారు. విశ్వవిద్యాలయం శిథిలాలను మాత్రం అక్కడ సంబంధించిన గృహ నిర్మాణాలు, శిలాఫలకాలలో పూర్వంలో ఉండే విధంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల మండలం అనుపు గ్రామంలో భద్రపరచడం చేశారు. ఇక్కడ పూర్వంలో బౌద్ధులు మార్షల్ ఆర్ట్స్ వంటి ప్రాక్టీస్ ఇక్కడే చేసేవారని చెబుతున్నారు.
ఇక్కడ గతంలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని ఆనవాళ్లు చూడటానికి పర్యాటకులు, నాగార్జునసాగర్ కు వచ్చిన ప్రతి పర్యాటకుడు దీనికి కొద్ది దూరం ఎత్తిపోతల జలపాతాన్ని అదే విధంగా స్వయంగా వెలిసిన దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. పిక్నిక్ పరంగా గాని, విహారయాత్ర పరంగా గాని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల పాటు ఇతర రాష్ట్రాల నుండి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారని లోకల్ 18 ద్వారా తెలిపారు.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
నల్గోండా, తెలంగాణ తెలంగాణ హైదరాబాద్, హైదరాబాద్, తెలంగాణ
ఆగస్టు 08, 2024 12:19 PM
























