చివరిగా నవీకరించబడింది:
Extramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను చంపేసే అంత విరక్తిని కలిగించింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అర్ధరాత్రి అత్యంత దారుణంగా హతమార్చిన తర్వాత ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.
ప్రేమికుడు హత్యకు పాల్పడ్డాడు: రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆడవాళ్ల ఆలోచన విధానం, నవీన పోకడలే కాకుండా వ్యక్తిగత అవసరాలు, శారీరక వాంఛకోసం దిగజారుతున్న తీరు చూస్తుంటే సభ్యసమాజమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నెలకొంది. వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను చంపేసే అంత విరక్తిని కలిగించింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అర్ధరాత్రి అత్యంత దారుణంగా హతమార్చడమే కాకుండా కనీసం పశ్చాత్తాపం, బాధ పడకుండా భర్తను చంపిన గదిలో రాత్రంతా పోర్న్ వీడియోలు చూసింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఓ వివాహిత చేసిన దురాగతం ఆలస్యంగా బయటకు రావడంతో పోలీసులు ఆమెతో పాటు హత్యకు సహకరించిన ప్రియుడ్ని అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చిలువూరు గ్రామానికి చెందిన లక్ష్మీ మాధురికి లోకం శివనాగరాజు అనే వ్యక్తితో 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు మగ సంతానం కూడా ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో నాగరాజు మృతి చెందాడు. స్థానికంగా ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్న నాగరాజు భార్య విజయవాడలోని ఓ సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్‌లో పనిచేసేది. సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయమైంది. అది కాస్తా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధాన్ని పెంచింది. భర్త ఊరంతా తిరిగి ఉల్లిపాయలు అమ్మడం మాధురికి కాస్త నామూషీగా అనిపించి భర్తను వ్యాపారం మాన్పించి.. తన ప్రియుడు హైదరాబాద్‌లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తుండడంతో అక్కడికి ఉద్యోగానికి పంపింది.
నాగరాజు హైదరాబాద్‌లో ఉంటున్న సమయంలోనే మాధురి, గోపి తరచూ కలుసుకునే వారు.ఈ విషయం నాగరాజుకు తెలియడంతో కొంతకాలం తర్వాత నాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరు వచ్చేశాడు. దీంతో తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి తరచూ అతనితో గొడవపడుతూ ఉండేది. భార్యాభర్తల మధ్య వివాదాలు పెరిగాయి. నాగరాజు ఎక్కువగా ఇంటివద్ద నుంచే వ్యాపారం చేస్తుండడంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగా మారింది. ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాధురి భావించింది. ఈ నెల 18న రాత్రి ఆమె తయారు చేసిన బిర్యానీలో 20 నిద్ర మాత్రలు కలిపి భర్తకు పెట్టింది. నిద్రపోయిన తర్వాత రాత్రి 11.30 సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిపించి నిద్రపోతున్న నాగరాజు ఛాతీపై గోపి కూర్చోగా మాధురి దిండుతో ముక్కుపై అదిమి నొక్కిపట్టింది. అతడు మృతిచెందాడని నిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాత్రంతా మాధురి పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.
భర్తను ప్రియుడి సహాయంతో చంపి తెల్లవారుజామున 4గంటలకు ఇంటి పక్కన వాళ్లను పిలిచి తన భర్త హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడని నమ్మించింది. హడావుడిగా నాగరాజు అంత్యక్రియలు పూర్తి చేయాలని.. ఎవరికి అనుమానం రాక ముందే చేతులు దులుపుకోవాలని భావించింది. అయితే మాధురి ప్రవర్తన, చెప్పిన మాటలకు పొంతన లేకపోవడం, భార్యభర్తలు తరచూ గొడవ పడటం, వివాహేతర సంబంధం తెలిసిన చుట్టుపక్కల వాళ్ల మాటలు విన్న నాగరాజు స్నేహితులు మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించే అరగంట ముందు ఇంటికి చేరుకొని పోస్ట్ మార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. పోలీసులకు సమాచారం చేరవేశారు.
మృతుడు నాగరాజు చెవిలో నుంచి రక్తం రావడం, చెవి వద్ద గాయం కనిపించడంతో తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఎస్సై వెంకటరవి కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నివేదికలో మృతుని ఛాతీ వద్ద ఎముకలు విరిగి ఉండడం, గాలి ఆడకుండా చేయడంతో చనిపోయాడని తేలడంతో పోలీసులు మాధురిని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.ఆమె ప్రియుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు, ఆంధ్రప్రదేశ్

























