చివరిగా నవీకరించబడింది:
సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రభుత్వంతోపాటు పోలీసుల తీరును తప్పుపట్టారు.
పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాగా మారిపోయాయని, ఇతర అధికారులు కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అది చేసే విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే KTR అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కుంటయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో గెలుస్తాం ఓడుతామని, మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నామని ఇంత చిల్లర రాజకీయాలు ఎప్పుడు చేయలేదని సివిల్ మ్యాటర్లలో పోలీసులు దూరం సెటిల్మెంట్లు చేయడం, అరాచకం చేయడం ఎంత మాత్రం మంచిది కాదని, నేను ఏ ఒక్కరినో విమర్శ చేయడం లేదని అన్నారు. కుంటయ్య తనకు రావలసిన డబ్బులు రావడం లేదని కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు ఉల్టా ఆయన మీదనే కేసు బనాయించి, వేధించారని మా పార్టీ మాజీ ఎంపీటీసీ కుంటయ్యకు జరిగింది. రేపు ఇంకొకరికి జరుగుతుందని ఇది మంచిది కాదని దయచేసి ఇటువంటివి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు KTR వెల్లడించారు.
ఇంతకుమించి నేను రాజకీయంగా మాట్లాడలేనని ఆ కుటుంబానికి పూర్తిస్థాయి పార్టీ తరఫున అండగా ఉంటామని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. మాజీ ఎంపిటిసి కుంటయ్య మృతి చెందడం చాలా బాధాకరమని, కుంటయ్య బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి.. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు KTR.
సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ప్రభుత్వంతోపాటు పోలీసుల తీరును తప్పుపట్టారు. ఏసీబీ తనను విచారిస్తున్న తరుణంలో హైదరాబాద్ కు వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉండి నాకు ధైర్యం చెప్పాడని కుంటయ్యను గుర్తు చేసుకుంటూ సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. టిఆర్ఎస్ కుటుంబ సభ్యుడిని ముఖ్య నేతను కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం తెలవగానే ఒక్కసారిగా తన మనసు కకావికలమైందని కేటీఆర్ మీడియాకు తెలిపారు. మృతి చెందిన కుంటయ్య ఇద్దరు పిల్లల చదువుతోపాటు వివాహాల బాధ్యతను తీసుకుంటానని వారి కుటుంబ సభ్యులకు మాట ఇచ్చానని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే KTR తెలిపారు.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
సిర్సిల్లా, కరీంనగర్, తెలంగాణ
జూన్ 18, 2025 7:45 PM
























