చివరిగా నవీకరించబడింది:
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. రుతుపవనాల మందగింపు వల్ల ఎండ, ఉక్కపోత, వర్షాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రుతుపవనాలు మందగించడంతో అంటే.. రుతుపవనాలు రావడం తొందరగా వచ్చినప్పటికీ అది గమనంలో నెమ్మదిగా ఉండటంతో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా కొన్నిచోట్ల తీవ్రమైన ఎండ, కొన్నిచోట్ల తీవ్రమైన ఉక్కపోత.. కొన్నిచోట్ల వర్షాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో ఉదయం అయ్యేసరికి తీవ్రమైన ఎండ.. మధ్యాహ్నం వచ్చేసరికి కాస్త వాతావరణం చల్లబడి… సాయంత్రానికి వానలు కురుస్తున్నాయి.
ఈ ప్రభావం రెండు రాష్ట్రాలలో అన్నిచోట్ల ఉంది. ప్రస్తుతం మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం అధికారి, మెటరాలజిస్టు, సైంటిస్ట్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాలో శని, ఆదివారాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది. సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. అటు దక్షిణ కోస్తాలో శని, ఆదివారాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది. సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
జూన్ 21, 2025 9:49 ఆన్

























