హస్తం పార్టీపై కుంభకోణాల ఆరోపణలు..
కాంగ్రెస్, ఏఐసీసీ, పీసీసీ అంటే ఇదే..
కాంగ్రెస్ అంటేనే అవినీతి, అరాచకాలు,అబద్దాలతో కట్టిన మూడు రంగుల టవర్ అంటూ ప్రచారం చేస్తున్నారు గులాబీ నేతలు.ఇందులో ఏఐసీసీ అంటే ఆలిండియా కరప్షన్ సెంటర్ అని పీసీసీ అంటే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ఆఫ్ కరప్షన్ అంటూ సెటైర్లు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తోంది గులాబీ పార్టీ.
జీవన్ రెడ్డి చెప్పిన ఏ టూ జడ్ స్కాముల వివరాలు ఇవిగో..
కాంగ్రెస్ చరిత్రంతా అంటే A- TO Z స్కామ్‌లే..
A-అంటే అనుముల బ్రదర్స్ స్కామ్‌లు
B-అంటే బస్సుల స్కామ్
C-అంటే కరప్షన్, కమీషన్లు, కలెక్షన్లు
D-అంటే డాక్యుమెంటరీ ఫోర్జరీ స్కామ్స్, ఢిల్లీకి డబ్బుమూటలు
E-అంటే ఎంప్లాయి రిక్రూట్ మెంట్ స్కామ్‌లు
F-అంటే ఫార్మా భూ దందాలు, ఫోర్త్ సిటీ స్కామ్ లు,ఫయిమ్ ఖురేషీ అక్రమాలు.
G-అంటే గ్రెయిన్స్ స్కామ్
H-అంటే హైడ్రా కలెక్షన్స్ స్కామ్,హైడ్రా క్లియరెన్స్
I-అంటే ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం
j-అంటే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం, మంత్రులు, అధికారులు జైళ్ల పాలు
K-అంటే కర్ణాటక మిల్క్ కోపరేటివ్ స్కామ్ ద్వారా రూ రేవంత్ రెడ్డి అకౌంట్ లోకి రూ.45కోట్లు
L-అంటే లియోనియా రిసార్ట్ ల్యాండ్ స్కామ్ 10,000 కోట్లు
M-అంటే మైనింగ్ మాఫియా
N-నేషనల్ హెరాల్డ్ స్కామ్
O-అంటే ఆఫర్స్ స్కామ్ లు, ఆన్ లైన్ బెట్టింగులు
P-అంటే ప్యాడీ స్కామ్
Q-అంటే- క్వారీల స్కామ్ (గ్రానైట్, శాండ్)
R-అంటే రైస్ స్కామ్, RRR ట్యాక్స్
S–అంటే శాండ్ మాఫియా
T-అంటే ట్రైబల్ వెల్పేర్ స్కామ్
V-అంటే- వోట్ ఫర్ నోట్ కేసు,వాల్మీకి కుంభకోణం
W-అంటే- వెస్ట్రన్ స్ప్రింగ్ స్కామ్, వైన్ మాఫియా, లిక్కర్ రేట్ల పెంపు, వైట్ కాలర్ క్రైమ్స్
X,Y – ఈ రెండు అక్షరాలకు సంబంధించిన స్కాములు ఇంకా రేవంత్ రెడ్డి ఇంట్లో తయారవుతున్నాయి
Z -అంటే – జీరో దందాలు
తప్పుడు ప్రచారంతో లబ్ది..
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు అభయహస్తంలోని కొన్ని పథకాలైనా అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది. అందులో భాగంగానే ఆరు గ్యారెంటీలను నిదానంగా ఆచరణలో పెడుతోంది. కాని బీఆర్ఎస్ వాటిలో కూడా కుంభకోణాలే అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలని నిర్ణయించుకుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
హైదరాబాద్, తెలంగాణ
జూన్ 20, 2025 6:24 PM
























