టీజీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు – ఇలా చెక్ చేసుకోవాలి:
- పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
- ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఆప్షన్లు కనిపిస్తాయి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీ స్కోర్ డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
మరోవైపు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కాగా…కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,51,779 మంది విద్యార్థులు క్వాలిఫై కాగా…. అగ్రికల్చర్-ఫార్మా విభాగంలో 71,309 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
























