జూన్ 23న సీట్ల కేటాయింపు….
దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 13 నుంచి మొదలైంది. ఈ గడువు జూన్ 19తో పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్లు ఈ తేదీల్లోనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూన్ 23న విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 23వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. జూన్ 24 నుంచి 28వ తేదీల మధ్య ఓరియేంటేషన్ ఉంటుంది. జూన్ 30వ తేదీన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి.
























