- అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ని సందర్శించండి.
- హోమ్ పేజీలో ‘TS Inter Supplementary Result 2025 for 1st or 2nd year’ అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- టీజీ ఐపీఏఎస్ఈ (TG IPASE) ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోండి.
ఉత్తీర్ణత వివరాలు
మే 22 నుండి మే 29, 2025 వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 4,13,880 మంది విద్యార్థులు (మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, జనరల్, ఒకేషనల్ కలిపి) రాష్ట్రంలోని 892 పరీక్షా కేంద్రాల్లో హాజరయ్యారు. పరీక్షల అనంతరం, 14 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో సమాధాన పత్రాలను దిద్దగా, జూన్ 3 నుండి 6 వరకు 33 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి.
























