చివరిగా నవీకరించబడింది:
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో మహిళల్లో పీరియడ్స్ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఎక్కువ మంది మహిళలను బాధిస్తోంది. అయితే ప్రతిరోజూ యోగాసనాలు చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించి శరీరాన్ని సమతుల్యంలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం మారుతున్న పరిస్థితులలో చాలా మంది మహిళల్లో పీరియడ్స్ సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. అయితే ఇందులో కొంతమంది ఇర్రెగ్యులర్ గా వచ్చే పీరియడ్స్ సమస్యలు మహిళలను ఎక్కువగా వేధిస్తుంటాయి. ఇందుకు ప్రధానమైన కారణాలు ఇవే అని ఖచ్చితంగా చెప్పలేము కానీ మారుతున్న వాతావరణం తినే ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే సమస్యలు కొన్ని అయితే మరికొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. సాధారణంగా మహిళలకు 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తుంటాయి. కానీ కొంతమందిలో మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఉంటుంది.
ఫలితంగా నెలకోసారి రావాల్సిన పీరియడ్స్.. రెండు లేదా మూడు వారాలకోసారి వస్తుంటాయి. మరి కొందరిలో మాత్రం ఒకే నెలలో రెండుసార్లు పీరియడ్స్ రావడం సహజమే కానీ, కొంతమందిలో మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పలు అసాధారణ సమస్యలకూ కారణం కావచ్చని చెబుతున్నారు నిపుణులు. అందుకే వ్యక్తిగతంగా కనిపించే లక్షణాల్ని బట్టి వైద్యుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు అలాంటి వారికి ప్రతిరోజు యోగ ఆసనాలు చేయడం వల్ల చాలావరకు సమస్యలు తగ్గిపోవడమే కాకుండా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి అంటున్నారు కర్నూలు జిల్లా ప్రముఖ యోగ శిక్షకులు ముంతాజ్ బేగం.
మహిళలు ప్రతిరోజు తమకు సమయం దొరికినప్పుడల్లా రోజుకు 20 నిమిషాల పాటు యోగ ఆసనాలు వేస్తే ఇర్రెగ్యులర్ గా వచ్చే పీరియడ్స్ సమస్యను అదిగమించొచ్చు అంటున్నారు. అందులో మొదటి ఆసనం బోట్ రైడింగ్. ఇందులో మనం కూర్చుని రెండు కాళ్ళను సమానంగా ముందుకు చాచి పాదాలను కాస్త వెనక్కు అని నీళ్లలో బోట్ ను ఎలాగా నడుపుతారో అలా 10 సార్లు కుడి ఎడమ వైపు చేయాలి, అ తరువాత దండాసనంలో కొచ్చి 10 లెక్కపెట్టుకుని మెల్లిగా శ్వాసను పీలుస్తూ వదులుతూ ఉండాలి.
ఇక రెండవది చక్కి చలనాసనం ఇందులో రెండు కాళ్లను రెండు వైపులా చాచి శరీరాన్ని అటు ఇటు తిప్పుతూ 10 సార్లు చేయాలి, ఆ తరువాత దండాసనంలో కొచ్చి 10 లెక్కపెట్టుకుని మెల్లిగా శ్వాసను పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఇక మూడవది బటర్ఫ్లై ఆసనం ఇందులో కూర్చుని రెండు కాళ్లను దగ్గరగా అనుకుని బటర్ఫ్లై రెక్కల లాగా కాళ్ళను ఊపుతూ ఉండాలి. ఇలా మూడు ఆసనాలు చేస్తే ఎలాంటి సమస్యలు రావంటున్నారు యోగా శిక్షకురాలు ముంతాజ్ బేగం.
హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, హోమ్ రెమిడీస్, పేరెంటింగ్ టిప్స్, రిలేషన్షిప్ గైడెన్స్, ఫిట్నెస్, యోగా టిప్స్, ట్రావెల్, ఫ్యాషన్, ఫుడ్ స్టోరీస్‌ని న్యూస్ 18 తెలుగు లైఫ్‌స్టైల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
కర్నూల్, కర్నూల్, ఆంధ్రప్రదేశ్
జూన్ 21, 2025 6:16 ఆన్
























