తప్పిపోయిన బాలుడను 10 నిమిషాల్లో వెతికి తల్లి చెంతకు చేర్చిన తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది.

మీడియా ప్రతినిధి – తిరుపతి: తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలలో స్వామివారి పుష్కరణ వద్ద దక్షత కుమార్ 5 సంవత్సరాలు తండ్రి శంకర్ గణేష్, మిట్ట స్ట్రీట్ తిరుపతి. బాబు తప్పిపోయాడని వెస్ట్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు.
తెప్పోత్సవాలలో స్వామివారి పుష్కరిని వద్ద బాబు తప్పిపోయాడని విషయం తెలుసుకున్న జిల్లా
ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు వెంటనే వెస్ట్ సిఐ గారికి ఒక బృందం ఏర్పాటు చేసి బాబుని వెతకమని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెస్ట్ సీఐ శ్రీ. మురళీమోహన్రావు వారి ఆధ్వర్యంలో రాము హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ రవికుమార్ మరియు జ్ఞాన శేఖర్ వారు ఒక బృందంగా ఏర్పడి బాబుని 10 నిమిషాల్లోనే కనిపెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చడమైంది.
పది నిమిషాల వ్యవధిలోనే బాలుని కనిపెట్టిన సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
























