పునరుద్దరణీయ ఇంధన వనరులకు ప్రాధాన్యత…
ప్రస్తుతం ఏపీలో నిర్మిస్తున్న నూతన ఇంధన వనరుల ప్రాజెక్టుల్లో విండ్ పవర్, సోలార్ పవర్, స్మాల్ హైడ్రో, బయో మాస్ బేస్డ్ ప్రాజెక్టులు, బయో ఎనర్జీ కో జనరేషన్, మునిసిపల్ సాలిడ్ వేస్ట్,ఇండస్ట్రీయల్ వేస్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 2024-25 నాటికి ఈ ప్రాజెక్టుల ద్వారా 9982.489 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. 2025-26లో ఇప్పటి వరకు మరో 36మెగావాట్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 10వేల మెగావాట్ల విద్యుత్‌ను ఈ శాఖ చేరుకుంది.
























