రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…
- అభ్యర్థులు వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
- రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
- మీ విద్యా అర్హతలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం వంటి వాటిని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరల్లో సబ్మిట్ నొక్కి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
- ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ నెంబర్ ఆధారంగా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ – 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే సీపీగెట్ ప్రవేశ బాధ్యతలు చూస్తోంది.





















