చివరిగా నవీకరించబడింది:
విశాఖపట్నం పాఠశాలలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీలలో సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2025 సందర్భంగా విశాఖపట్నంలోని పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా విద్యా శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రకటన చేసింది. విశాఖపట్నం జిల్లా అన్ని యాజమాన్య పాఠశాలలకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21, 2025 సందర్భంగా జూన్ 20, 21 తేదీలలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 20, 21లలో పాఠశాలలో ఉదయం సమయాలలో యోగా కార్యకలాపాలు విధిగా నిర్వహించాలన్నారు. అంటే విద్యార్థులు యోగా చేసి వెళ్తే చాలు.
సంబంధిత ఫోటోలను లీప్ యాప్ నందు అప్లోడ్ చేయవలసిందిగా తెలియజేశారు. ఇప్పటికే నెల రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా సచివాలయ పరిధిలో ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. పాఠశాలలో ప్రారంభం నుండి పాఠశాలలో పిల్లలకు కూడా యోగా ఆసనాలు నిర్వహిస్తున్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఉపాధ్యాయులు, పిల్లలు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ సెలవు ప్రకటించారు. స్కూలు సమయ పాలనలో భాగంగా పిల్లలందరూ వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ప్రస్తుత యువత నుండి యోగా పై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
నెల రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా అనేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో అధిక శాతం పిల్లలు ముందుకు వచ్చి యోగా ట్రైనర్లుగా తయారయ్యారని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. పిల్లలందరికీ యోగాంధ్రలో భాగంగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ట్రైనింగ్ పొందిన పిల్లలకు విశాఖ ఆర్కే బీచ్‌లో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఆసనాలు వేసే అవకాశం ఉందని తెలిపారు. ఇది నేటితరం పిల్లలకి మంచి సువర్ణ అవకాశాన్ని తెలిపారు. నేటి తరం యువత యోగా తప్పనిసరిగా నేర్చుకోవాలి అని తెలిపారు.
ఇప్పటి పిల్లలు ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా బలంగా ఎదగాలంటే యోగా ఒక ముఖ్యమైన మార్గం. విద్యా వ్యవస్థలో భాగంగా యోగాను ప్రవేశపెట్టే ఈ చర్య వల్ల విద్యార్థుల భవిష్యత్తు మరింత దృఢంగా నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ముందడుగు పిల్లలలో యోగా పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందరూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం దిశగా అడుగులు వేయగలుగుతాం.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
జూన్ 19, 2025 5:19 PM






















