చివరిగా నవీకరించబడింది:
సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 6న శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. 7-24 తేదీల్లో దర్శన వేళల్లో మార్పులు ఉంటాయి.
సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణం గంగ ధార వద్ద గల శ్రీ కోదండ రామాలయంలో ఈనెల 6 వ తేదీ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి కొమ్ముల సుబ్బారావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. దేవస్థానం ప్రాంగణంలో వేంచేసిన శ్రీ సీతారాముల ఆలయాల ప్రాంగణంలో శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు.
శ్రీ స్వామివారి గంగ ధార వద్ద వేంచేసియున్న శ్రీ కోదండ రామాలయం లోను పశ్చిమ రాజగోపురం వద్ద ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణం ఉదయం 10గంటల 30 నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవాలకు భక్తులు పాల్గొనాలని కోరారు.
అప్పన్న స్వామి దర్శనం వేళల్లో మార్పులు: నెల 8వ తేదీ సింహాద్రి అప్పన్న స్వామి ఈ వార్షిక తిరు కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని 7వ తేదీ నుంచి 24వరకు దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఆ రోజుల్లో ఆర్జిత సేవలు ఉండవని ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. 7వ తేదీ నుంచి 14వరకు సుప్రభాత సేవ, ఉదయం, రాత్రి ఆరాధన సేవల్లో భక్తుల భాగస్వామ్యం ఉండదన్నారు. అలాగే రాత్రి 7గంటల తర్వాత భక్తులకు దర్శనాలు లభిస్తున్నాయని తెలిపారు.
13వ తేదీ శ్రీపుష్పయాగం సందర్భంగా సాయంత్రం 6గంటలకు దర్శనాలు నిలిపివేస్తామన్నారు. ఆలయంలో ఉదయం పూట విశేష హోమాలు జరిగే నేపథ్యంలో ఆయా రోజుల్లో 7.30గంటల నుంచి దర్శనాలు ఆరంభమవుతాయన్నారు. 10వ తేదీన పండిత సదస్యం సందర్భంగా ఉదయం 8గంటల తర్వాత సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రతి ఒక్క భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనలకు రావాలని తెలిపారు. ఈ నెలలో ప్రత్యేక రోజులు ఉండడంతో ఇటువంటి అంతరాయం ఉందని తెలిపారు. స్వామివారిని దర్శించి ఆశీస్సులు తీసుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఏప్రిల్ 05, 2025 3:21 PM

























