చివరిగా నవీకరించబడింది:
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు ఈరోజు నుంచి సమ్మె బాట పట్టనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో గ్రామ వలంటీర్లు అసంతృప్తితో ఉన్నారు. వాటి పరిష్కారం కోసమే నిరసనకు దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వాలంటీర్లు (Volunteers)ఈరోజు నుంచి సమ్మె బాట పట్టనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో గ్రామ వలంటీర్లు అసంతృప్తితో ఉన్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న జీతం సరిపోవడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.అందుకే తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం(Tuesday) సమ్మె(Strike)కు దిగుతున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనకూడదని తీర్మానించుకున్నారు. వాలంటర్లు సమ్మెకు దిగకుండా ప్రభుత్వం ప్రయత్నించినప్పటికి ఆదిశగా వాళ్లు సంతృప్తి చెందలేదు. దీంతో సమ్మెకు సిద్దమవుతున్నారు.సమ్మెకు దిగుతున్న వాలంటీర్లు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆమధ్య ఉద్యోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ఇక ఇప్పుడు వాలంటీర్ల వంతు వచ్చింది. ఏపీలో గ్రామ వలంటీర్లు మంగళవారం నుంచి సమ్మె చేయనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వలంటీర్లు సమ్మె చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు.
సమ్మెకు దిగుతున్న వాలంటీర్లు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆమధ్య ఉద్యోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ఇక ఇప్పుడు వాలంటీర్ల వంతు వచ్చింది. ఏపీలో గ్రామ వలంటీర్లు మంగళవారం నుంచి సమ్మె చేయనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వలంటీర్లు సమ్మె చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు.
గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ..
వాలంటీర్లు సమ్మెకు దిగకుండా ఉండాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే అవేమి సంతృప్తికరంగా లేకపోవడంతో వాలంటీర్లు సమ్మె సైరన్ మోగించారు. 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థను తెచ్చిందే జగన్ ప్రభుత్వం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారని..ప్రజలకు ఇంటికే ప్రభుత్వ సేవలు చేరవేయాలనే ఆలోచనతో గ్రామ, వార్డు, సచివాలయ వాలంటీర్లను నియమించింది.2019 అక్టోబర్‌లో విధుల్లోకి చేరిన వాలంటీర్లకు అప్పటి నుంచి ఒక్కొక్కరికి నెలకు 5వేల జీతం చెల్లిస్తోంది.
ఫలించని ప్రభుత్వం బుజ్జగింపులు..
ప్రభుత్వ పథకాల అమలులో వలంటీర్ల వ్యవస్థ క్రియాశీలకంగా ఉంది. అయితే వారికి చెల్లించే గౌరవ వేతనానికి సంబంధించి కొంత కాలంగా వలంటీర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలంత కూడా తమకు రావట్లేదని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారి సమస్యల్ని పట్టించుకోకపోవడంతో ఈవిధంగా సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం తాజాగా 750రూపాయలు పెంచుతామని ప్రకటించింది. ఆ పెంచిన మొత్తాన్ని 2024 జనవరి నుంచి అందిస్తామని ప్రకటించింది. అయితే ఆ ప్రకటనతో కూడా వాలంటీర్లు సంతృప్తి చెందడం లేదు.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 26, 2023 8:42 AM

























