చివరిగా నవీకరించబడింది:
Trending News: ఏ వ్యక్తి అయినా ప్రాణపాయస్థితిలో ఉంటే బ్రతికించేది డాక్టర్లు. కాని అభిమానం కూడా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తుందంటే ఎవరైనా నవ్వుతారా.. నమ్మరు సరి కదా ఇలాంటి కథలు పిల్లలకు చెప్పమని నవ్వుకుంటారు.కాని తెలంగాణలో జరిగిన ఈసంఘటన తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
ట్రెండింగ్ న్యూస్: ఏ వ్యక్తి అయినా ప్రాణపాయస్థితిలో ఉంటే బ్రతికించేది డాక్టర్లు. కాని అభిమానం కూడా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తుందంటే ఎవరైనా నవ్వుతారా.. నమ్మరు సరి కదా ఇలాంటి కథలు పిల్లలకు చెప్పమని నవ్వుకుంటారు.కాని తెలంగాణలో జరిగిన ఈసంఘటన తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. నిజమే వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో ఉండే తైలం రమేశ్ వ్యక్తి అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యాడు. ఉన్నపళంగా కుప్పకూలిపోవడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు నిర్ధారించుకున్నారు. ఇక అంత్యక్రియలు నిర్వహించే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తైలం రమేశ్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అభిమాని కావడం తనకు నచ్చిన లీడర్ బొమ్మన ఛాతిపై పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అయితే తన అభిమాని చనిపోయాడని తెలిసి చివరి చూపు చూసేందుకు నిరంజన్ రెడ్డి వచ్చి అతని ఛాతిపై ఉన్న పచ్చబొట్టు చూశారు.
తమ అభిమాన నాయకుడు ఇంటికి వచ్చి రమేష్ మృతదేహం దగ్గర నిల్చున్నారు. కుటుంబ సభ్యులు మీరంటే అభిమానం అని ..చాతిపై వేయించుకున్న పుట్టుమచ్చని చూపించారు. ఇంతలో నిరంజన్ రెడ్డి దాన్ని పరిశీలిస్తుండగా చనిపోయాడని భావించిన తైలం రమేష్ ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా కనిపించడంతో వెంటనే అక్కడున్న వారితో ఇదే విషయాన్ని చెప్పి దగ్గరగా అబ్జర్వ్ చేశారు.
ప్రాణాలతో ఉన్నట్లుగా గుర్తించి వెంటనే పేరు పెట్టి పిలవడంతో చనిపోయాడనుకున్న రమేష్ స్పందించాడు. అంతే అతనిపై వేసిన పూల దండలను తొలగించి వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ సమయానికి వైద్యం చేయడంతో రమేష్ తిరిగి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.
తమ కుటుంబ పెద్ద చనిపోయాడని బాధపడుతున్న వారికి ఈ సంఘటన ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అంత్యక్రియలకు వెళ్లాల్సిన వ్యక్తి తిరిగి తమ మధ్యకు ప్రాణాలతో రావడంతో ఆనందంతో అందరి ముఖాలు వెలిగిపోయాయి. ఈవిషయం ఆ నోటా ఈనోటా పడటంతో అందరూ ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు.
వానపార్తి, మహబబ్‌నగర్, తెలంగాణ
సెప్టెంబర్ 02, 2025 3:25 PM

























