యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యతని ఇస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, ఏకాగ్రతను పెంచడంలో, శక్తిని పెంచడంలో, శ్వాసను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందవచ్చు. యోగాలో అనేక రకాలు ఉన్నాయని హనుమకొండ నగరానికి చెందిన యోగా ట్రైనర్ సుష్మ తెలిపారు. యోగాలో హఠయోగ, విన్యాస యోగ, రెజొరేటివ్ యోగ, ట్రెడిషనల్ యోగ, ప్రినేటల్ యోగ, యాంటినేటల్ యోగ ఇలా పలు రకాలుగా ఉన్నాయి.
హఠయోగ: ఇది శారీరక ఆసనాలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానంపై దృష్టి కేంద్రీకరిస్తుంది.
విన్యాస యోగా: ఇది శ్వాసతో సమన్వయం చేసుకుంటూ ఆసనాలను మార్చే శైలి. దీనిలో ఒక ఆసనం నుండి మరొక ఆసనంకు వేగంగా కదులుతారు.
రిజోరేటివ్ యోగ: రిజోరేటివ్ యోగ అనేది పరికరాలు ఉపయోగించి చేస్తారు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవాళ్లు కింద కూర్చోలేరు కాబట్టి చైర్ పై కూర్చుని ఈ యోగా చేయవచ్చు.
ప్రీనేటల్ యోగా: అనేది గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన యోగ. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. ప్రసవం సులభతరం కావడానికి ఒత్తిడిని తగ్గించడానికి శరీరాన్ని బలోపేతం చేయడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
యోగ అనేది ఉదయం, సాయంత్రం వేళలో చేయాలి. ఉదయం వేళలో కొంతమంది వృత్తిరీత్యా బిజీగా ఉంటారు. అలాంటి వారు ఉదయం వేళలో కుదరకపోతే సాయంత్రం వేళలో యోగా చేయవచ్చు. యోగా చేసేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఐదు సంవత్సరాల వయసు పైబడిన వారి నుంచి ఎవరైనా యోగ చేయవచ్చని తెలిపారు.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
వరంగల్, తెలంగాణ
జూన్ 20, 2025 9:04 PM





















