భాద్రపద మాసం విఘ్నేశ్వరుడికి అత్యంత విశిష్టమైనది అని అన్నారు. ఈ మాసంలో వినాయక చవితి జరుపుకోవడం విశేష ఫలప్రదమని, భక్తులు పత్రిదళాలు, పూలు, గరికతో గణనాథుని పూజిస్తే సకల విఘ్నాలు తొలగుతాయని తెలిపారు. అష్టోత్తర శతనామావళితో గానీ, శాస్త్రోక్త నామాలతో గానీ, యధాశక్తిగా పూజలు చేస్తే రుణాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు తొలగి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తెలియజేశారు.
సంవత్సరంలో అన్ని మాసాల్లోనూ గణనాథుని పూజ ఫలప్రదమే అయినా, భాద్రపద మాసం విఘ్నేశ్వరుడికి అత్యంత విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే శుక్ల చతుర్థిని వినాయక చవితిగా జరుపుకుంటారుని తెలియజేశారు.ఈ మాసంలో గణనాథుని ఆరాధిస్తే ఆటంకాలు తొలగి సుఖసంతోషాలు లభిస్తాయి. ముఖ్యంగా రుణాలు, వ్యాధులు, కుటుంబ సమస్యలు తొలగిపోవడంతో పాటు ఆయురారోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయిని అనంత స్వామి పేర్కొన్నారు.ఏ కార్యం తలపెట్టినా ఆటంకాలు తొలగుతాయి.విద్య, జ్ఞానం, పరిశోధనలో విజయాలు లభిస్తాయి.రుణాలు, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.కుటుంబంలో శాంతి నెలకొంటుంది.ఆరోగ్య సమస్యలు తొలగి, ఆయురారోగ్యం పెరుగుతుంది.
భక్తులు కోరుకున్న కోరికలు శుభప్రదంగా నెరవేరతాయిని అన్నారు.
ఏ కార్యం ప్రారంభించే ముందు గణపతిని ఆరాధిస్తే ప్రతీ ఆటంకం తొలగిపోతుంది. గణనాథుని అనుగ్రహం లేకుండా ఏ శుభకార్యం విజయవంతం కాదని జ్యోతిష శాస్త్రం, పురాణాలు చెబుతున్నాయని ఆయన వివరించారు.భాద్రపదమాసంలో 21 రోజుల పాటు గణపతి 16 నామాలతో పూజలు చేసే భక్తులకు తప్పక అనుకున్న కోరిక నెరవేరుతుంది అని ఆయన తెలియజేస్తున్నారు.
వినాయక చవితి రోజు భక్తులు మట్టి గణపతిని ప్రతిష్ఠించి, పూజలు జరిపే ఆచారం ఉంది. ఈ ఆచారం పర్యావరణ పరిరక్షణకూ ఉపయోగపడుతుంది. గణపతిని పత్రి, గరికతో పూజించడం ఒక విశిష్టత అని, ఆ ఆచారం శాస్త్రోక్తంగా వ్రతంలో భాగమని వెల్లడి చేశారు.
వినాయక చవితి అనేది కేవలం పండుగ మాత్రమే కాక, ఆధ్యాత్మికంగా శక్తివంతమైన రోజు అని అనంత స్వామి చెప్పారు. భాద్రపద మాసం అంతా గణనాథునికి పూజలు చేస్తే భక్తులకు అనేక శుభఫలితాలు కలుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని ఆరాధించి, దైవ ఆశీస్సులు పొందాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh
ఆగస్టు 26, 2025 11:48 AM
























